సిరా న్యూస్,కావలి ;
కావలి నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే టికెట్టు కావ్య కృష్ణారెడ్డికి ఇస్తేనే తెదేపా మరల కావలిలో గెలుస్తుందని అతనికి తప్ప ఇంక ఏ వ్యక్తికి ఇచ్చిన తెదేపా ఘోరంగా ఓటమి రుచి చూస్తుందని నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. మొదటగా కావలి తెదేపా ఎమ్మెల్యే టికెట్ అందరూ కావ్య కృష్ణారెడ్డికి ఇస్తున్నారని అభిప్రాయపడుతున్న తరుణంలో టికెట్టు వేరే వారికి ఇవ్వాలని హై కమాండ్ మంతనాలు సాగిస్తుందని తెలియడంతో ఇప్పటివరకు తెదేపా అనుచరులు కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డికి టికెట్టు ఇస్తేనే మేము తెదేపాకు మద్దతు పలుకుతామని లేకపోతే తమ మద్దతు ఎట్టి పరిస్థితుల్లో తెదేపాకు చూపబోయేది లేదని నియోజకవర్గ ప్రజలు మరియు కావ్య అనుచరులు సన్నిహితులు దృఢంగా తెలియజేస్తున్నారు. కావ్య సామాజిక వర్గానికి చెందిన చాలామంది కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుంటే కావలిలో తెదేపా ఓటమి ఖచ్చితమని అభిప్రాయపడుతున్నారు. కావ్యకి తెదేపా ఎమ్మెల్యే టికెట్టు ఇస్తే బాగుంటుంది అని నియోజకవర్గంలోని చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు.