Tehsildar Chandrasekhar Reddy: రీ సర్వే స‌మ‌స్య‌ల‌కు గ్రామ సభల ద్వారా ప‌రిష్కారం : తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి

సిరాన్యూస్‌, సామర్లకోట
రీ సర్వే స‌మ‌స్య‌ల‌కు గ్రామ సభల ద్వారా ప‌రిష్కారం : తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి

గ్రామాలలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం రీ సర్వే గ్రామ సభలను ఏర్పాటు చేసిందని సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వల్లూరు గ్రామంలో బుధవారం రీ సర్వే గ్రామ సభ ప్రారంభించారు. గతంలో భూముల రీ సర్వే సందర్భంగా జరిగిన పొరపాట్లు వలన అనేక సమస్యలు ఉత్పన్నమై, భూ యజమానులు తమ భూ హక్కు అనుభవము రికార్డులలో సరిగా నమోదు చేసుకోవడం కోసం రెవెన్యూ ఆఫీసులకు, పౌరఫిర్యాదుల పరిష్కార వేదిక వద్దకు అత్యధిక సంఖ్యలో వస్తున్నార‌ని తెలిపారు. ఈ స‌మ‌స్య‌ను ప్రభుత్వము గుర్తించి రీసర్వే సమస్యల పరిష్కార నిమిత్తము ప్రత్యేకంగా ప్రతి గ్రామములోనూ రీసర్వే గ్రామసభల ఏర్పాటుకు సంకల్పించింద‌ని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు. స‌మావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *