సిరాన్యూస్, బేల
పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ: తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్
* ఓటర్ జాబితా పైన బీఎల్ఓలకు అవగాహన సదస్సు
ఓటర్ జాబితాలో మార్పులు, సవరణను పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్ మండలంలోని అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ జాబితా పైన అవగాహనా సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టి ఓటర్ జాబితాలో మార్పులు, సవరణను పకడ్బందీగా నిర్వహించడం కోసం బి ఎల్ ఓ లతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్డీఓ ఆదేశాల మేరకు శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో బి ఎల్ ఓ లకు గ్రామాల్లో ఓటర్ జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులను ఒకే చోట చేర్పించాలని సూచించారు. దీనికి సంబందించిన ఓటర్ తుది జాబితా లిస్ట్ ని సంబంధిత బి ఎల్ ఓ లకు అప్పగించడం జరిగింది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ సిడాం వామన్ రావ్, కార్యాలయ సిబ్బంది, వివిధ గ్రామాల బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.