సిరాన్యూస్, సైదాపూర్:
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్ మంజుల
సైదాపూర్ మండలంలో ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ ఆధ్వర్యంలో సోమవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మంజుల ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, ఛైర్మన్ పిట్టల శైలజ, వైస్ చైర్ పర్సన్ మాలతి, సెంటర్ ఇంచార్జ్ రంజిత్, సీసీలు రమేష్, శ్రీనివాస్, జమున, రాజేశ్వరి, వివోఏలు రేణుక శ్రీ, కనకలక్ష్మీ, అనిత, ఏంఏస్ స్టాఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.