సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
దళారులను ఆశ్రయించవద్దు: తహసీల్దార్ ఎండి వకీల్
* పెద్దంపేటలో సివిల్ రైట్స్ డే
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్మం డలంలోని పెద్దంపేట గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూమి, సర్టిఫికెట్లు సమస్యలున్నా నేరుగా తాసిల్దార్ కార్యాలయం కు రావాలని మధ్య దళారులను ఆశ్రయించవద్దని తాసిల్దార్ ఎండి వకీల్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన చారి, డిప్యూటీ తాసిల్దార్ గర్రెపల్లి శంకర్, ఎంపీ ఓ గోవర్ధన్, ఎంఈఓమహేష్, ఆర్ఐ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.