సిరాన్యూస్, కుందుర్పి
భూ సమస్యలను పరిష్కరించడమే రెవెన్యూశాఖ లక్ష్యం: తహసీల్దార్ ఎస్పీ శ్రీనివాసులు
* తహసీల్దార్‌కు దండోరా నాయకులు ఘన సన్మానం
మండలంలో నెలకొన్న రైతు భూ సమస్యలను పరిష్కరించడమే రెవెన్యూ శాఖ లక్ష్యమని, ఆదిశగా ముందుకు పయనిస్తానని నూతన తహసీల్దార్ ఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన కుందుర్పి తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ ఎస్పీ శ్రీనివాసులు పదవి బాధ్యతలను స్వీకరించారు. తొలత నూతన తాసిల్దార్ కు తాసిల్దార్ కార్యాలయం లో శ్రీనివాసులకి ఘనంగా సత్కరించగా, శాలువా కప్పి తాసిల్దార్ శ్రీనివాసులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన తహసీల్దార్ మాట్లాడుతూ తాను ఇంతకుముందు బొమ్మనహల్ మండలంలో పనిచేసినని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు కుందుర్పి మండలానికి వచ్చానని వివరించారు. ప్రజా హిత సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలను కోరారు రైతులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది విధినిర్వహణలో ను ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. భూ సమస్యలను ఇప్పటినుండి తలెత్తకుండా చూస్తానని తెలిపారు. తాసిల్దార్కు అధికార పార్టీ నాయకులు, దండోరా నాయకులు, పూలమాలలు వేసి ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో శివలింగప్ప, వైబి ఓబయ్య, ఎం శివమూర్తి, జాకీ, నవీన్ కుమార్, సలిమేశ్, జోగుల రామాంజనేయులు, కమిటీ చైర్మన్ లావణ్య, రాంగిరే రమేష్ తదితరులు దండోరా నాయకులు పాల్గొన్నారు