సిరాన్యూస్, కుందుర్పి
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: తహసీల్దార్ ఎస్.పి శ్రీనివాసులు
రైతులు సమస్యలును రీ-సర్వే భూముల గ్రామసభలు ద్వారా గుర్తించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని తహసీల్దార్ ఎస్.పి శ్రీనివాసులు అన్నారు. బుదవారం కుందుర్పి మండల పరిధిలోని ఎస్, మల్లాపురం, నిజవళ్ళి గ్రామాలలో రి సర్వే గ్రామ భూములు గ్రామసభలు కార్యక్రమం స్థానిక పాఠశాల ఆవరణంలో చేపట్టారు. తొలత గ్రామసభలలో రెవెన్యూ అధికారులు దృష్టికి ఆ గ్రామాల రైతులు తమకు పొలాలలో గతంలో రి సర్వే చేసిన విస్తీర్ణం హెచ్చు,తగ్గులు ఉన్నాయని తెలిపారు. తద్వారా పొలంలో హెచ్చుతగ్గులను సరి సమానంగా విస్తీర్ణం రికార్డులు ఉండేలా చేసేలా గుర్తించాలని అధికారులను రైతుల కోరారు. అదేవిధంగా కొంతమంది రైతులకు భూముల పట్టాదార్ పాస్ పుస్తకం లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులకు పట్టాలు అందజేయాలని కోరారు.కాగా తండ్రి నుంచి కొడుకులుకు వారసత్వంగా వచ్చిన పట్టాలకు తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ వైబ్ లాండ్ లో 1బిలో వస్తాయని, బయట మీసేవ ,గ్రామ సచివాలయ కేంద్రాలలో వన్,బి, లు రావడంలేదని తెలిపారు. రైతులు సమస్యలును రీ-సర్వే భూముల గ్రామసభలు ద్వారా గుర్తించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్,ఐ, పోతన్న సర్వేయర్లు, ఎనుముల దొడ్డి, గ్రామ విఆర్ఓ, అశోక్, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.