సిరా న్యూస్, ఓదెల
గాంధీజికి తహసీల్దార్ యాకన్న నివాళి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.