2030 వరకు తెలంగాణ ఎడారిగా మారబోతుంది

మీరు వింటున్నది నిజమే

ప్రముఖ వ్యాసకర్త సయ్యద్ జావిద్ పాషా

 సిరా న్యూస్,కమాన్ పూర్;
రాబోయే 2030 వరకు తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారబోతుందని ప్రముఖ వ్యాసకర్త ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ కి చెందిన సయ్యద్ పాషా తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలోని నది మానేరు పరిహక ప్రాంతాలలో ఇసుకను తీయడం వల్ల నీటిమట్టం పడిపోతుంది.
10 అడుగుల లోతులో ఉండే నీటి మట్ట ఇప్పటికే ముప్పై అడుగుల వరకు పడిపోయింది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి ఇప్పటికే పంట పొలాల్లో నీరందకా రైతులు ఇబ్బంది పడుతున్నారు
పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇక తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదు వర్షాకాలంలో ఎప్పుడో పోయిన వాన ఇంతవరకు జాడలేదు. వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడిన నిల్వ చేసుకునే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా అవి తాగు నీటిని సరఫరా చేయడం భవిష్యత్తులో చాలా కష్టంగా మారబోతుంది . ఇక సాగునీరు విషయానికి వస్తే పంటలకు నీరు అందక రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పల్లెల్లో పని లేక పల్లెవాసులంతా పట్నం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు పంటలు పండిస్తేనే మన 5 వేళ్ళు లోపలికి పోతున్నాయి. అలాంటి రైతుకు ఆధారమైన అటువంటి వనరులైన ఇసుకను తరలించడం వలన భవిష్యత్తులో ఏం జరుగుతుందో భయం వేస్తుంది. ప్రభుత్వాలు ఆదాయాన్ని తప్ప రైతుల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు
రైతులే దేశానికి వెన్నుముక అన్నారు
వెన్నుముకనే విరిగా కొట్టారు.
మన కంట్లోకి మన వేలును గుచ్చుకున్నట్టుంది . బాధ ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో చాలా బాగా తెలుస్తుంది. ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి మన వనరులను మనం కాపాడుకుందాం. మన పిల్లల భవిష్యత్తును కాపాడుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *