సిరా న్యూస్,హైదరాబాద్;
మంగళవారం ఎన్టిఆర్ భవన్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీన దినోత్సవ వేడుకను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తరువాత తెలుగుదేశం పార్టీ జెండానూ ఆవిష్కరించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టిఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ… హైదరాబాద్ సంస్థానాన్ని కాకతీయులు, కులికుతుబ్షాహీలు, అసఫ్జాహీ వంశస్తులు పాలించారు. తరువాత భారత మిలిటరీ చేతుల్లోకి వెళ్లిన తరువాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో 564 సంస్థానాలు ఉండగా 1947లో అవ్వన్నీ రద్దయినాయి. రాచరికాలు పోయి ప్రజలే రాజులయ్యారు. అయినా తెలంగాణ ప్రాంతంలో పటేల్`పట్వారీ వంటి వ్యవస్థ కొనసాగేది. ఈ వ్యవస్థలో తండ్రి, కొడుకు, మనువడు ఇలా వారసత్వంగా ఈ వ్యవస్థ కొనసాగింది. ఈ వ్యవస్థ వల్ల బడుగు, బలహీనవర్గాల వారు అనేక కష్టాలకు గురయ్యే వారు. ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించి పటేల్`పట్వారీ వ్యవస్థను ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. అలాగే పాలనను ఎన్టిఆర్ మండలాల వరకు తీసుకెళ్లగా దీనిని చంద్రబాబు గ్రామాల వరకు విస్తరింపజేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అజ్మీరా రాజునాయక్, శ్రీనివాసా నాయుడు, ఎబిఆర్ మోహన్రావు, రత్నాకర్ రావు, నాయుడు రామకోటేశ్వర్ రావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.