సిరా న్యూస్,తిరుమల;
తెలంగాణ కాంగ్రేస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీ కృష్ణ, కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, టిటిడి అధికారులు శేష వస్ర్తంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ అహంకార నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. తెలంగాణ లో కేసిఆర్ కు, ఏపిలో జగన్ కు, కేంద్రంలో మోడీకి. కేంద్రంలో మోడీకి ఆదరణ తగ్గింది, కాంగ్రేస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది.ఎన్డీయే ప్రభుత్వం ఈడీ, సిబిఐతో బెదిరిస్తూ గెలవాలని చూశారు. కాని ప్రజలు అంతా గమనిస్తున్నారు. పెద్దపల్లి ఎంపిగా వంశీకృష్ణ మంచి మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఎంపి వంశీకృష్ణ, మాట్లాడుతూ ప్రజల ఆదరణతో అత్యధిక మెజారిటీతో ఎంపిగా గెలవడం చాలా సంతోషంగా ఉంది. తిరుమల శ్రీవారి ఆశీశ్శులు తీసుకున్నాం. తాతయ్య కాకా వెంకట స్వామి అడుగుజాడలలో నడుస్తూ,
ప్రజకతో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కేషి చేస్తాననని అన్నారు.