ఆస్ట్రేలియాలో తెలుగు యువ వైద్యురాలి మృతి

 సిరా న్యూస్,సిడ్నీ;
ఆస్ట్రేలియాలో తెలుగు యువ వైద్యురాలి మృతి ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియాలోని రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఈ నెల 2న సరదాగా స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడింది. ఉజ్వల భౌతిక కాయాన్ని గన్నవరంలోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఉజ్వల మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు
==========xx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *