సిరా న్యూస్,పరిగి;
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ సంబంధించిన దుకాణాలు ఎండోమెంట్ ఆధీనంలో ఉండగా ఆరు నెలల నుంచి దుకాణ సముదాయాల అద్దె చెల్లించకపోవడంతో దుకాణ సముదాయాలను సీజ్ చేశారు అధికారులు.వికారాబాద్ జిల్లా పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 23 దుకాణ సముదాయాలకు తాళాలు వేసి సీజ్ చేసిన ఎండోమెంట్ అధికారులు.ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన అద్దెకు తీసుకున్న దుకాణదారులు.ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకున్నం.మార్చి నుంచి దేవదాయ శాఖకు చెందిన 23 దుకాణాల అద్దె కట్టడంలేదని , ఇవ్వనివారి దుకాణాలను తాళాలు వేసి సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.23 దుకాణాలకు కొంత మందే రెంట్ చెల్లిస్తున్నారని మరికొందరు చెల్లించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు.ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన అద్దెకు తీసుకున్న దుకాణదారులు.ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకున్నం.మార్చి నుంచి దేవదాయ శాఖకు చెందిన 23 దుకాణాల అద్దె కట్టడంలేదని , ఇవ్వనివారి దుకాణాలను తాళాలు వేసి సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.ఈనేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తరువాత అద్దెకట్టిన దుకాణాల తాళాలను తొలగించారు.