కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికుల ధర్నా
సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ వైఎస్సార్ కాలనీలో గురువారం ఉద్రిక్త నెలకొంది. కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికులు ధర్నా కు దిగారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ గంజాయి బ్యాచ్ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతుంది. దాంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్చేసారు. స్థానిక పోలీసులు నిఘా విఫలమయ్యారని మహిళల ఆవేదన. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను అరికట్టాలని మహిళలు డిమాండ్ చేసారు.