సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ స్టీల్ ప్లాంట్ లో విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది .స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయుల, విద్యార్థులు గేటు వద్ద బైఠాయించారు. 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలని అన్నారు.