సిరా న్యూస్,గాంధీనగర్;
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యం దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్న ఆరోపణ చాలాకాలంగా ఉంది. చట్టపరంగా రావాల్సిన సంస్థలను కూడా మోదీ తరలించుకుపోతున్నారన్న అభిప్రాయం దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రకు రావాల్సిన అనేక ప్రాజెక్టులను మోదీ పెండింగ్‌లో పెట్టారు. మంజూర చేస్తామన్న కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, మంజూరైన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం.. ప్రాజెక్టులకు జాతీయ హోదా.. ఇలా అనేక హామీలు పదేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ గుజరాత్‌కు తరలించుకున్నారు. ఏపీకి వచ్చిన కియా కార్ల కంపెనీనిన కూడా గుజరాత్‌కు తరలించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఫలించలేదు. తాజాగా దేశానికి వస్తున్న ప్రముఖ కార్ల తయారీ కంపెనీని కూడా గుజరాత్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో దక్షిణాదిపై ఎంత వివక్ష ఉందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశమంతా గొడ్డుపోయినట్లు.. పరిశ్రమలన్నీ మోదీ తన సొంత రాష్ట్రానికి తరలించుకుపోతున్నారన్న అభిప్రాయం మిగతా రాష్ట్రాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.దేశంలో ప్రజలు అంటే ఒక్క గుజరాతేనా.. మోదీ ఒక్క గుజరాత్‌కే ప్రధానా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రావడం లేదు. తాజాగా విదేశీ సంస్థ టెస్లాను కూడా సొంత రాష్ట్రానికి మోదీ తరలించుకుపవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.దేశంలో అనేక రాస్ట్రాలు పారిశ్రామికంగా వెనుకబడ్డాయి. నిరుద్యోగలు రేటు పెరుగుతోంది. కొత్త పరిశ్రమలు కావాలని యువత కోరుతోంది. కానీ ఇవేమీ మోదీ పట్టించుకోవడం లేదు. ఇటీవలే సూరత్‌లో అతిపెద్ద వ్యాపార సముదాయం ప్రారంభించారు. దీంతో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని స్వయంగా మోదీ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో తాజాగా టెస్లా కార్ల తయారీ సంస్థను కూడా గుజరాత్‌కే తరలించుకుపోవడం విమర్శలకు తావిస్తోంది. రాబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జనవరి 2024లో జరగబోతోంది. ఇందులో టెస్లాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి టెస్లా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. టెస్లా స్థానిక స్థాయిలో బ్యాటరీ ప్యాక్‌లను కూడా ఉత్పత్తి చేస్తే ఈవీ సెగ్మెంట్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.ప్రపంచంలోని అతిపెద్ద ఆటో మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో టెస్లా ప్రవేశిస్తే పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా టెస్లా భారతదేశం కోసం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూడా ప్రయత్నిస్తుంది. టెస్లా భారతదేశంలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్‌ను ప్రోత్సహించడంతోపాటు ఈవీ విభాగంలో స్థిరపడేందుకు ఆసక్తిగా ఉంది.టెస్లా మోడల్ 3, టెస్లా మోడల్ వై వంటి కార్లను సీబీయూ ద్వారా ఇక్కడకు తీసుకువస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే తయారీకి సంబంధించి కమిట్మెంట్ను టెస్లా ఇస్తే దిగుమతి పన్నును కూడా తగ్గించే అవకాశం ఉంది. ఇటీవలే లాంచ్ అయిన మోడల్ 3ని కూడా భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరాల్లో మరింత చవకైన స్థానికంగా ఉత్పత్తి అయిన మోడల్ 2 కూడా భారతదేశంలోకి రానుందని తెలుస్తోంది.మరోవైపు కియా మోటార్స్ కూడా భారతీయ మార్కెట్ కోసం ఒక అద్భుతమైన విజన్‌ని వెల్లడించింది. సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీతో విజయాన్ని అందుకున్న కంపెనీ ఇటీవల దానికి మిడ్ లైఫ్ అప్డేట్ను ఇచ్చింది. దీని తర్వాత 2024 జనవరిలో సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. ఇది కాకుండా హ్యుందాయ్ ఎక్స్టర్ తరహాలో ఒక మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనం కూడా లాంచ్ కానుంది. కంపెనీ ఇటీవలే భారతదేశంలో ‘కియా క్లావిస్’ పేరును ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేసింది. ఈ పేరును కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ మైక్రో ఎస్యూవీ కోసం ఉపయోగించవచ్చుఅనేక రాష్ట్రాలు పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని చెబుతున్నా.. మోదీ ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. నిబంధనల ప్రనకారం దేశంలోకి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడులను కేంద్రం అన్ని ప్రాంతాలకు సిఫారసు చేయాలి. అనువైన ప్రాంతాలను సంస్థలు ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ, మోదీ సర్కార్ అలా చేయడం లేదు. పారిశ్రామికీకరణకు అనువైన ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కూడా ప్రధాని అన్యాయం చేస్తున్నారు. గుజరాత్‌ను మాత్రం పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటున్నారు.