TGVP:ఘ‌నంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
* ఘ‌నంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం
* రిమ్స్ లో పండ్ల పంపిణీ

ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ 12 వ ఆవిర్భావ దినోత్సవాన్నిమంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా ప‌ట్ట‌ణంలోని కేసీపీ గార్డెన్ ముందర రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఉ మ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు కొట్టురి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా టీజీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉద్యమాలలో పురుడోసుకొని విద్యార్థి ఉద్యమాలే ద్యేయంగా ముందుకు వెళ్తున్న సంస్థ తెలంగాణ విద్యార్థి పరిషత్ అని తెలిపారు. ఎల్లప్పుడూ విద్యార్థుల కు అండగా నిలుస్తుంది అన్నారు. విద్యార్థుల పక్షాన పోరాడుతూ విద్యార్థులకు కావలసిన రావలసిన అన్ని రకాల మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేస్తూ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఇలాంటి కుల మత రాజకీయాలు చేయకుండా ఇలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఎల్లవేళలా విద్యార్థుల సంక్షేమ ధ్యేయంగా టిజి వి పి పనిచేస్తుందని చెప్పారు. అనంత‌రం బీసీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గడ్డల ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ బాబు, ఉమ్మడి జిల్లా లంబాడా ఐక్యవేదిక జాదవ్ మహేందర్ మాట్లాడారు. సంక్షేమ హాస్టల్ లో వస్తువులు కల్పనకై విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ పై టీజీవీపీ ఎల్లవేళలా పోరాటం చేస్తుందని, విద్యార్థులకు అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు పారదర్శకంగా న్యాయం చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది టీజీవీపీ అని కొనియాడారు. అనంతరం టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రిమ్స్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమలో ఆదిలాబాద్ పట్టణ కన్వీనర్ అదే ప్రవీణ్ , బోథ్ నియోజకవర్గ కో కన్వీనర్ సతీష్, శివ ,నిర్మల్ కార్యకర్తలు గణేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *