thalari Rangaiah: గెలుపే లక్ష్యంగా ప‌ని చేయాలి

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
గెలుపే లక్ష్యంగా ప‌ని చేయాలి
* ఎంపీ తలారి రంగయ్య
* మేము సిద్ధం…మా బూత్ సిద్ధం కార్యక్రమం
రానున్న ఎన్నికలు మ‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని, ఈ ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా ప‌ని చేయాలని అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయా కర్త, డా. తలారి రంగయ్య అన్నారు. మంగ‌ళ‌వారం మంగళగి­రిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వ­హిస్తు­న్నారు.రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించా­ల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశా­నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి కుందుర్పి మండలం, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, శ్రీ, సత్యనారాయణ శాస్త్రి, మండల జేసీఎస్ కన్వీనర్, ఈ రాము పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *