సిరాన్యూస్, కుందుర్పి
మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ఘన సన్మానం
కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అనంతపురం మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్యను గురువారం కుందుర్పి వైసీపీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మాజీ అనంతపురం పార్లమెంట్ సభ్యుడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్, తలారి రంగయ్యను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కాబోయే ఎమ్మెల్యే తలారి రంగయ్యకు అంటూ ముందుగానే అభినందనలు తెలియజేశారు. రంగయ్య జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహంతపురం గ్రామానికి చెందిన డీలర్ జి. నాగభూషణ, తలారి, హనుమంత రాయుడు , కే. ఈరన్న, జి.అమ్మేష్, జి. దొడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.