ముగ్గురు వృద్దులను మోసం చేసిన నిందితుడు అరెస్టు

సిరా న్యూస్,తణుకు;
ముగ్గురు వృద్ధులకు మాయమాటలు చెప్పి నగదు కాజేసిన నిందితుడిని అరెస్టు చేసామని . తణుకు పట్టణ సిఐ ఎం నాగరాజు వెల్లడించారు. ఘటన తణుకులో ఈనెల 1వ తారీఖున జరిగింది. నిందితుడు కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన షేక్ నాగూర్ మీరా వల్లి అలియాస్ అభి. నిందితుడు మీరావల్లి పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 46 కేసులున్నాయి. 👉 ఏటీఎం కార్డు మార్పిడి, బ్యాంకుకు వచ్చిన కస్టమర్లకు మాయమాటలు చెప్పి డబ్బులు దొంగలించడం, ప్రభుత్వ పథకాలు ఇస్తానని మోసం చేసి డబ్బులు కాజేయడం వంటి నేరాలు చేసాడు. 2011 నుంచి గతంలో అనేకసార్లు జైలు శిక్ష అనుభవించినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి గత నెల 13న విడుదల బయటకు వచ్చాడు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన ఎస్సైలు పి.అప్పారావు, కె.శ్రీనివాస్ కానిస్టేబుళ్లు ప్రసాద్, ఉదయకుమార్, మురళి, వీర్రాజులను సిఐ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *