సిరా న్యూస్;
అదే పేర్ని నాని బాధిత సంఘం..
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి
మంచి చేస్తారని ఎమ్మెల్యేని చేస్తే పేర్ని నాని చేసిందేమిటి..?
అందరితోనూ తగువ పెట్టుకుని ఓ బాధిత సంఘాన్ని ఏర్పర్చుకున్నారని విమర్శ..
రాష్ట్రంలో ఎక్కడా లేని బాధిత సంఘం మచిలీపట్నంలో ఉందని.. అదే పేర్ని నాని బాధిత సంఘమని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా TDP MLA అభ్యర్థి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన బందరు మండలం చిన్నాపురం గ్రామంలో పర్యటించారు.
చిన్నాపురం అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించిన సభలో మాట్లాడిన బాలశౌరి పేర్ని నానిపై పలు విమర్శలు చేశారు.
మంచి చేస్తారని పేర్ని నానిని ప్రజలు ఎమ్మెల్యేని చేస్తే ఆయన మాత్రం ప్రజలతో తగువ పెట్టుకుని ఓ పెద్ద బాధిత సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు.
ఈ ఐదేళ్లలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన మచిలీపట్నం ప్రజలకు సరిగ్గా నెల రోజుల్లో స్వేచ్ఛ స్వాతంత్ర్యం వస్తుందన్నారు.