సిరా న్యూస్,కమాన్ పూర్;
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యమని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. శనివారం కమాన్ పూర్ మండల కేంద్రం నుండి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహిస్తున్న జనజాతర సభకు వైనాల రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున తల్లి వెళ్లారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయడం కోసం తుక్కుగూడలో పెద్ద ఎత్తున సమావేశం కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించడం జరుగుతుందని దీనికి అతి రథ మహారథులు రావడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుందని అన్నారు. తల్లి వెళ్లిన వారిలో జూలపల్లి ఎంపిటిసి సెవ్వ శంకరయ్య నాయకులు రాజా మాజీ సర్పంచ్ కటకం రవీందర్ భద్రపు శంకర్ సాగి శ్రీధర్ రావు గాండ్ల మోహన్ కుక్క రవి బూడిద శ్రీనివాస్ చిందం సతీష్ కుచన వెంకటేష్ గొల్లపల్లి మొండి చొప్పది శేఖర్ జంగిలి కుమార్ బొంగుని సదయ్య కోలా నరస గౌడ్ భక్తుల అంజి గుమ్మడి వెంకన్న కటకం కొమరయ్య కటకం రాజయ్య తాళ్ల రాజయ్య తదితరులు జూలపల్లి పెంచికలపేట రొంపిగుంట కమాన్ పూర్ గ్రామాల నుండి తల్లి వెళ్లారు.