సిరా న్యూస్,కౌతాళం;
కౌతాళ మండలం ఉరుకుంద గ్రామ తెదేపా నాయకులు కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనం చేసుకొని ఉరుకుంద నుండి బుడుమలదొడ్డి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి దర్శించుకోవడం జరిగింది. నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటేసంక్షేమం జరగాలంటే పోలవరం అమరావతి రాజధాని ఇలాంటివన్నీ జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా రాఘవేంద్ర రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందాలని పాదయాత్ర చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు . ఎలివే ఈరన్న చిరంజీవి. కిందిగేరి నరసన్న. గొట్టూరి హుస్సేన్ .దొడ్డయ్య గారి అయ్యప్ప. మాజీ ఎంపిటిసి కురుగోడు. ఎంపీటీసీ ఏలివే ఈరన్న పోతులయ్య. సారాయి ఈరన్న. దొడ్డయ్య గారిమల్లయ్య. కిందిగేరి నర్సప్ప .మూలింటి మహాదేవ. కావలి వీరప్ప. గొంగళి తాయప్ప. ఇంగులపాటి వీరేష్.తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొని పాదయాత్ర విజయవంతం చేయడం జరిగింది.