చెరువులో దూసుకుపోయిన ఆటో

బాలుడి పరిస్థితి విషమం..
ప్రయాణికులను కాపాడిన స్థానికులు

సిరా న్యూస్, వికారాబాద్;
ఆటో అదుపు తప్పి చెరువులో దూసుకెళ్లి ప్రయాణికులు నీటా మునిగి ఒక బాలుని పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ సమీపంలో చోటుచేసుకుంది . వివరాల్లోకెళ్తే.
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ సమీపంలోని భూకైలాస్ దేవస్థానాన్ని దర్శించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఆటో అదుపుతప్పి చెరువులో దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నీట మునిగడంతో అందులో ఉన్న ఓ బాలుని పరిస్థితి ఆందోళనకరంగా మారింది దీంతో బాలుని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ 10 మంది తన కుటుంబ బంధువులతో కలిసి దోమ నుండి తాండూర్ పట్టణ సమీపంలో ఉన్న భూకైలాస్ దేవస్థానాన్ని బయలుదేరారు భూకైలాస్ దర్శనం అనంతరం సాయంత్రం వేళ తిరుగు ప్రయాణంలో మల్రెడ్డిపల్లి చెరువు కట్ట పై ప్రయాణిస్తుండగా ఆటో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ నీట మునిగారు. గమనించిన మల్లేటిపల్లి స్థానిక ప్రజలు నీట మునిగిన వారిని బయటికి లాగారు. నీట మునిగిన వారిలో శ్రీనివాస్ డ్రైవర్ కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బాలుని హైదరాబాద్ కు తరలించారు. ఇట్టి విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *