సిరా న్యూస్,అన్నవరం;
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అణివేటి మండపంలోని ధ్వజ స్తంభానికి స్వర్ణమయం మేఖలాలు, సుదర్శన్ చక్రం వంటి పనులు గురువారంతో పూర్తయింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ధ్వజ స్తంభానికి అమర్చిన స్వర్ణ మేఖలాలు, సుదర్శన చక్రానికి ఇంచార్జ్ ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు పురోహితులు ప్రత్యేక పూజలు చేసి 11 గంటలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 300 కిలోల రాగితో రూపొందించిన ధ్వజ స్తంభానికి, తాపడానికి 1800 గ్రాములు బంగారం, అయిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు. నెల్లూరుకు చెందిన దాతలు సహాయంతో మూడు కోట్లతో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట, దానికి స్వర్ణకవచం పనులు గత సంవత్సరం ప్రారంభం అయిన సంగతి విధితమే. ఈ ధ్వజస్తంభం కవచాల పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బంగారు పూత పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన ధ్వజస్తంభ దాత దంపతులు, ఏఈఓ దామెర్ల కృష్ణారావు, నాగభట్ల రవి శర్మ, పాలంకి పట్టాభిరామమూర్తి ( పెదపండు) అర్చకులు కోట సుబ్రహ్మణ్యం, దత్తు శర్మ, సుధీర్ కుమారు తదితరులు పాల్గొన్నారు.