సిరా న్యూస్,హైదరాబాద్;
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్. పరిధిలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. మీర్ చౌక్ చెన్ని తోట లో అశోక్. కుటుంబం తోనివాసముంటున్నాడు. అశోక్ ఆటో డ్రైవర్, సునీత కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకటేష్(13) అనే కొడుకు ఉన్నాడు. బాలుడికి సరిగా మాటలు రాకపోవడo తో మానసిక సమస్యలు వున్నవి. ఈ నెల 4న తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఈసమయంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలే డు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 8886951982. 7075852824 నంబర్లకు సమాచారం అందించాలని తల్లిదండ్రులు కోరారు.