ప్రయాణికులు సురక్షితం
సిరా న్యూస్,కోదాడ;
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో అర్ధం రాత్రి అదుపు తప్పిన రెయిన్బో ప్రైవేట్ ట్రావెల్ బస్సు రహదారి పక్కనే ఉన్న పాడుబడిన ఇంట్లోకి దూసుకుపోయింది. హైదరాబాదు నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోకి రాగానే పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు తిప్పడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన ఇంట్లోకి దూసుకు వెళ్ళింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో కరెంటు వైర్లు తెగిపడి ఒకసారిగా కరెంటు పోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు వారికి ఎవరికి ఏమీ కావటం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నరు. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రధమ చికిత్స చేయించి అనంతరం వేరే బస్సులో పంపించారు