సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో అదుపుతప్పిని కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులో మద్యం మత్తులో యువకుల హల్చల్ చేసినట్లు సమాచారం. ప్రమాదంలో కారు ముందు భాగం తుక్కుతుక్కు అయింది. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
===========