సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పై ఆగి ఉన్న బొగ్గు లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్దమై కారు నడుపుతున్న వ్యక్తి పూర్తిగా సజీవ దహనం అయ్యారు.
ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద మేడ్చల్ నుంచి వస్తున్న కారు వైజాగ్ నుంచి పాశమైలారం లో బొగ్గును అన్ లోడ్ చేసేందుకు వెళ్లే క్రమంలో ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమవడంతో పాటు కారు నడుపుతున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. కారు నంబర్ ప్లేట్ సగం వరకు కాలిపోవడం, వ్యక్తి పూర్తిగా దగ్దమవడంతో ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారు పూర్తిగా దగ్ధం అవ్వడంతో పోలీసులు కార్ నెంబర్ ను గుర్తించి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని సీఐ ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు.