సిరా న్యూస్,చిత్తూరు;
డ్రైవర్ నిద్రపోవడంతో కారు బోల్తా పడి భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ కు చెందిన దంపతులు కుమారస్వామి రాజు(62) భార్య జయలక్ష్మి(56) సొంత పనిపై బాడుగ కారులో బెంగుళూరుకు బయలుదేరారు. మార్గ మధ్యంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ముదివేడు గురుకుల పాఠశాల వద్దకు రాగానే, డ్రైవర్ రాజు నిద్రపోవడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగ్ గాయపడగా, దంపతులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. 108 సిబ్బంది మనోహర్ తదితరులు బాదితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నట్లు తెలిపారు