భారత్ తో పాటు తెలంగాణ వికాసానికి కేంద్రం కృషి చేస్తున్నది

వికసిత భారత్ కార్యక్రమంలో అధికారుల వెల్లడి

సిరా న్యూస్,నెక్కొండ;
భారతదేశ అభివృద్ధి తో పాటు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో భారత్ తో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని ఆయా పథకాలకు సంబంధించిన శాఖల అధికారులు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పనికర గ్రామంలో మంగళవారం వికసిత భారత్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పింగిలి విజయ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్ఈడి స్క్రీన్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు పథకాలను దృశ్య రూపంగా ప్రజలకు చూపించారు. అనంతరం ప్రజలకు ఒక్కో శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు పథకాలు దానివల్ల ప్రజలకు ఉపయోగం ఎంతమందికి ఉపయోగపడుతుంది వివరించారు.11.52 లక్షల ఉత్సవాల గ్యాస్ కలెక్షన్లు పేద మహిళలకు పొగ నుండి విముక్తి కల్పించారని గ్యాస్ ప్రతినిధి కుంట మధు తెలిపారు. సొంతింటి కల సహకారంకై 2.33 లక్షలకు పైగా గృహాలు మంజూరు చేశారని, అలాగే శుద్ధమైన సురక్షితమైన తాగునీటి సదుపాయంకై 54 లక్షల కుళాయి కనెక్షన్లు ప్రజలు కల్పించిన ప్రభుత్వం, అణగారిన వర్గాలకు సామాజిక భద్రతకై పీఎం జన్ ధన్ యోజన కింద 1.13 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించారని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన కింద 60 లక్షల పాలసీలు నమోదు చేసుకుని అటల్ పెన్షన్ యోజన కింద 19 లక్షల మందికి చందాలు ఇవ్వడమైందని అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 19 లక్షలమంది చంద్రధారులుగా నమోదయినారని వీటితోపాటు అటల్ పెన్షన్ యోజన పథకం కింద 1900000 మంది చందాదారులుగా నవోదయనారని వీటితోపాటు పిఎం స్వామి ది యోజన పథకం కింద 3.75 లక్షల మంది లబ్ధిదారులకు నిర్వహణ మూలధనం కింద 881 కోట్లు సౌకర్యం కల్పించారని,తో ప్రపంచంలోని అతి పెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ పీఎం ఆరోగ్య యువజన ఏటా కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య భీమా ఈ పథకం కింద 75.77 లక్షల పైగా ఆయుష్మాన్ కార్డులు భారత ప్రభుత్వం విడుదల చేసిందని, 5,213 ఆరోగ్య శ్రేయో కేంద్రాలు ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుతున్నాయని, పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలు నాణ్యమైన ఔషధాలు మందులు లభ్యత కోసం రాష్ట్రంలో 186 ఔషధ దుకాణాలు పనిచేస్తున్నాయని ఇంచార్జ్ మెడికల్ అధికారిణి డాక్టర్ రమ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *