క్షుద్ర పూజల కలకలం

సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివారం అమావాస్య వచ్చిందంటే క్షుద్ర పూజలతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవలసిన పరిస్థితి ఏర్పడింది. నిన్న ఆదివారం, అమావాస్య కావడంతో నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరిగాయి. సత్తుపల్లి మండలం తుంబూరు, భీమవరం రోడ్ లో క్షుద్ర పూజలు చేసిన ఘటన స్థానిక ప్రజలతోపాటు, ఉదయాన్నే పంట పొలాలకు వెళ్లే రైతులను సైతం కలవరపెడుతుంది. ఈ ప్రాంతంలో నిత్యం క్షుద్ర పూజలు చేస్తూ ఆ ప్రాంతమంతా భయానక వాతావరణంతో మంత్రగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.దీంతో స్థానికులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేసి వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలనీ కోరుతున్నారు. ఇది ఒక్క తుమ్మూరు ప్రాంతంలోనే కాదు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర పూజలు కారణంగా స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కళాజాతాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *