సిరా న్యూస్,హైదరాబాద్;
శనివారం నాడు నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు. తెల్లవారుజామునే జంబో మెషిన్ లతో కూల్చేసేందుకు స్పాట్ కు సిబ్బంది చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడి కుంట చెరువు కు సంబంధించిన బఫర్ లో ఎన్ కన్వెన్షన్ ను కట్టారు అని అనేక ఫిర్యాదులు అందాయి.