సిరా న్యూస్,హైదరాబాద్;
స్వచ్ఛతా కా అభి యాన్ కార్యక్రమంలో భాగంగా సైదాబాద్ డివిజన్ పరిధిలోని కుర్మా బస్తి శ్రీ శివంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు గోపి, బీజేవైఎం నాయకులు దినేష్, ఆశిష్, మహిళా మోచ నాయకురాలు సంధ్య, మంజుల,కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సం దర్భంగా ఆలయ శుద్ధితోపాటు ఆలయ ప్రాం గణంలో చెత్తాచెదారం వంటి వ్యర్థాలను తొల గించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు స్వచ్ఛతా కా అభియాన్ కార్యక్రమాన్ని ఆలయాల్లో కొనసాగిస్తున్నామ ని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించినప్పడే స్చచ్ఛత ఉంటుందన్నారు.