సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూర్రావుపేట గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం ఉపాదికోసం గల్ఫ్ దేశమైన దుబాయ్ లోని అలేన్ లో పని చేస్తున్నాడు.అయితె గతనెల క్రితం రోడుపై నడుచుకుంటు వెళుతుండగా మ్యాన్ హోల్ లో పడ్డాడు,గుర్తించిన స్తానికులు అసుపత్రికి తరలించెలోపు మృతి చెందాడు.విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపటంతో కన్నీరుమున్నీరయ్యారు,మృతదేహాన్ని స్వగ్రామం తెప్పించాలని వేడుకోగా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో ఈరోజు స్వగ్రామం చేరింది. మృతుడికి బార్య రజిత,కొడుకులు శివ,వంశీ,కూతురు హర్షవర్ధిని ఉన్నారు..