సిరా న్యూస్,ఏలూరు;
దెందులూరు నియోజకవర్గ తిమ్మారావు గూడెం కు చెందిన కేశన నరేంద్ర, భారతి,దంపతులు సోమవారం రెండవ కాన్పు నిమిత్తం ఏలూరు ఏరియా ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు . వైద్య పరీక్షలు అనంతరం మంగళవారం డెలివరీ కి వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసారు. సిజిరియన్ చేసి శిశువు పేగు మెడకు బిగుసుకొని చనిపోయిందని డాక్టర్ చెప్పింది. స్కానింగ్ లొ అన్ని బాగానే ఉన్నాయని చెప్పిన వైద్యులు, చనిపోయిన బిడ్డను మా చేతిలో పెట్టడం ఏమిటని బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ముందు కదలకుండా వాగ్వాదానికి దిగారు.
=========