సిరా న్యూస్,బాపట్ల;
బాపట్లజిల్లా కొరిశపాడు మండలం లోని జాతీయ రహదారిపై మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్ లారీని, మరో ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. అయితే ట్యాంకర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. మృతుడు నెల్లూరు జిల్లా కు చెందిన కొట్లూరి శ్రీధర్ గా గుర్తించారు. సోప్ ఆయిల్ లోడుతో కృష్ణపట్నం పోర్టు నుండి గుంటూరు వెల్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
==========================