పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ప్రశంసనీయం

ఎస్పీ జి. కృష్ణకాంత్
హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్
సిరా న్యూస్;కర్నూలు;
పోలీసుల సంక్షేమమే ముఖ్యము అని అందరూ బాగా పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ అన్నారు.
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో 61 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతిభద్రతల పరిరక్షణలో విధులు, సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు. అందరిసహాయ సహాకారాలతో ఒక టీమ్ వర్క్ గా పని చేస్తనే మంచి పేరు వస్తుందన్నారు. దేవరగట్టు బన్ని ఉత్సవం, పండగలు, ఆదోని, కర్నూలు వినాయచవితిలలో మంచిగా విధులు నిర్వహించారన్నారు.వచ్చే ఎన్నికల విధులలో అందరూ బాగా పని చేయాలన్నారు. జిల్లా ఎస్పీ గా నా పరిధిలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తానన్నారు. సమస్యలుంటే జిల్లా ఎస్పీ వాట్సప్ నెంబర్ కు పంపించాలన్నారు.అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. పారదర్శకంగా, నిజాయితీగా పని చేయాలన్నారు. క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. హోంగార్డ్ కమాండెంట్సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్ మాట్లాడుతూ 1963 సంవత్సరంలో ఆవిర్భవించిన హోంగార్డు వ్యవస్థ పోలీసుశాఖలో కీలకంగా మారిందన్నారు. ఇతర డిపార్ట్ మెంట్ లలో కూడా హోంగార్డులుమంచి విధులు నిర్వహిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *