లంక సాగర్ ప్రాజెక్టు కు పోటెత్తిన వరద

నిండుకుండలా జలాశయం
 సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంక సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 16 అడుగులు ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 18 అడుగుల పైనే వరద ప్రాజెక్టు పై నుండి రెండు అడుగుల మేర ప్రవహిస్తుండడంతో దిగువ నున్న పంట పొలాలు నీట మునిగాయి. ఇలా జల కలను సంతరించుకున్న ప్రాజెక్టును చూడటానికి పర్యాటకులు వచ్చి వెళ్తున్నారు. ఏది ఏమైనా ఇంకొక రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుతో పాటు వేసిన పంట నష్టం భారీ స్థాయిలో ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *