సిరా న్యూస్,శ్రీకాకుళం;
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వి.వి.ఆర్ పేట గ్రామ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు ఐదు ఎకరాలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో మామిడి, జీడి, టేకు, తోటలు దగ్దమైయాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలార్పారు. చేతి కొచ్చిన పంట తోటలలో అగ్నిప్రమాదం జరగడంతో రైతులు ఆందోళనకు గురైయారు.