రైతులు డిమాండ్
తమ పొలాలు పండించుకునే అవకాశం కల్పించాలి.
సిరా న్యూస్,పామర్రు;
తోట్లవల్లూరు మండలం రొయ్యూరు కృష్ణానది పాయలో పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను తొలగించుకునేందుకు అవకాశం కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే. నెంబర్ 323లో సుమారు 30 ఎకరాల్లో ఇసుక మేట వేసుకుపోయిందని, మేటలను తొలగించి పంట పొలాలు సాగు చేసుకున్నందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మేటలు తొలగించుకోలేదని, తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన చెందారు..
తోట్లవల్లూరు మండలంలో భద్రిరాజు పాలెం, చాగంటిపాడు, రొయ్యూరు, వల్లూరు పాలెం గ్రామంలో పట్టా భూములు ఉన్నాయన్నారు. ఈ భూముల్లో ఉన్న ఇసుకను తొలగిస్తే ప్రస్తుతం ఈ నియోజకవర్గం, మచిలీపట్నం గుడివాడ ప్రాంత ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను తొలగించుకున్నందుకు అవకాశం కల్పించాలని కోరారు..