సిరా న్యూస్,సిద్దిపేట;
సయ్యద్ సలీమ్ మొద్దీన్, హెడ్ కానిస్టేబుల్, 1995 బ్యాచ్ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. 1995 బ్యాచ్ మెంట్ మిత్రులందరూ కలసి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిద్దిపేట పట్టణం నసీర్ నగర్ సయ్యద్ సలీమ్ మొద్దీన్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు అందజేసి మానవత్వాన్ని చాటారు.
ఈ కార్యక్రమంలో బ్యాచ్ అధ్యక్షుడు మహ్మద్ పాషా, త్రీ టౌన్ ఎస్ఐ విజయ్ భాస్కర్, బ్యాచ్ మెంట్ మిత్రులు శ్రీనివాస్ రావు, నర్సింగరావు, రాజమల్లు, ప్రభాకర్, అనిల్, రాజిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.