క్లైమాక్స్ కు చేరిన ఎన్నికల వేడి

సిరా న్యూస్,హైదరాబాద్, 
తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరింది. శనివారంతో ప్రచారం ముగియడంతో నేతలు తమ తమ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు విపరీతంగా డబ్బు పట్టు బడేది. మారిన పరిస్థితుల రీత్యా ట్రెండ్ సెట్ చేశారు నేతలు. డబ్బుకు బదులుగా బంగారం, లిక్కర్ వంతైంది.తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో భారీగా మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. మార్కెట్లో దీని విలువ అక్షరాలా దాదాపు మూడు కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. జడ్చర్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వాహనాల్లో కెఏ 22సీ 2983 నెంబరు గల లారీని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. పుష్ప సినిమా స్టయిల్‌లో పాల వ్యాన్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేశారో.. పైన ఎరువులు నింపి వాటి కింద మద్యం బాటిళ్లను నింపేశారు.తొలుత పోలీసులు ఎరువులు అనుకుని భావించారు. కాకపోతే లాఠీతో లారీని అన్ని వైపులా కొడితే సౌండ్ మారడంతో అనుమానం వచ్చింది. వెంటనే లారీలో సరుకును కూడా చెక్ చేయడంతో మద్యం వ్యవహారం వెలుగుచూసింది. గోవా నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఏపీ ఎక్కువగా గోవా లిక్కర్ హంగామా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చారు ఏపీ ఎన్నికల అధికారులు. దీంతో గోడౌన్ల నుంచి లిక్కర్ ఎక్కడకు వెళ్తుందనేది క్లియర్‌గా అధికారులకు సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు గోవా లిక్కర్‌‌పై ఫోకస్ చేసినట్టు చెప్పుకొచ్చారు.వారం కిందట నంద్యాల వద్ద కూడా భారీ ఎత్తున గోవా మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండురోజులు ఉండడంతో పోలీసులు తెలంగాణలోనే కాదు, ఏపీలో అడుగడుగునా పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్, భారీ ఎత్తున మొహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *