బీజేపీ
సిరా న్యూస్,ఇబ్రహీంపట్నం;
గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వం పేదవాడికి సమాధానం చెప్పాలని మైలవరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నూతులపాటి బాల అన్నారు. గత ప్రభుత్వం లో 5 నుండి 10 శాతం పూర్తికాని ఇళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి 4సంవత్సరాల 9నెలలైనా ఇవ్వలేదు. 50వేల రూపాయలు కట్టిన లబ్దిదారులు చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 180000 రూపాయలు ఇంటికి ఒక్కొక్క లబ్దిదారుడు నాలుగు లక్షలు నష్టపోవాలా? ప్రథాని నరేంద్ర మోడీ పధకాలను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడపకి తీసుకెళతాం. పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవ కోసమే పని చేస్తామని అన్నారు.