సిరా న్యూస్,మెదక్;
టేక్ మాల్ మండలం వెల్పుగొండ గుట్టపై పార్శనాధుని విగ్రహం చోరీ అయింది. గతంలోనూ పలుమార్లు ఆ విగ్రహం చోరీకి దుండగులు ప్రయత్నించారు. మేకల కాపరి సమాచారంతో విగ్రహం చోరీ వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెల్పుగొండలోని గుట్టపై కాకతీయుల కాలంలో నిర్మించిన తుంబురీశ్వర ఆలయం ఉంది. దీనికి ఎదురుగా ఉన్న చెరువు మధ్యలో దేవతల గుట్ట ఉంది. దీనిపై క్రీ.పూ. 5వ శాతాబ్దానికి చెందిన పార్శ్వనాథుడి విగ్రహం ఉండేది. 40 రోజుల క్రితం సూరం పల్లి గ్రామానికి చెందిన బ్రహ్మం ఆ విగ్ర హాన్ని అక్కడే చూశాడు. శుక్రవారం మేకల మేత కోసం సాయిలుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గుట్టకు వెళ్లారు. ఆ ప్రాంతంలో తాళ్లు, వాహనాల టైర్లు, కర్రలు ఇతర సామగ్రి ఉండడంతో అనుమానం వచ్చి విగ్రహం కోసం వెతకగా కనిపించలేదు. వెల్పుగొండ మాజీ సర్పంచి నారాయణ ఫిర్యాదుతో ఏఎస్సై అక్కడికి చేరుకొని వివరా లు సేకరించి కేసు నమోదు చేశారు. గతేడాది జులైలో ఇదే విగ్ర హాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు