గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోరం

సిరా న్యూస్,గుడివాడ;
లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలలోని విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు. నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షించాలని ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా తక్షణ శిక్షలను అమలు చేయాలనే డిమాండ్ అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం అవుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *