సిద్ధమంటున్న ఇండియా కూటమి

సిరా న్యూస్;
దేశంలో లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ తరువాత ఇండియా కూటమి నేతలు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యనేతలు హాజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అయితే జూన్ 1న పలు రాష్ట్రాల్లో మొత్తం 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూషన్‌ అలియన్స్‌ పేరుతో కూటమిగా ఏర్పడింది.ఈ కూటమి జూన్ 1న ఇటు తుదిదశ పోలింగ్ జరుగుతుండగా అదే రోజు శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తో పాటు ఇతర ముఖ్య నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అలాగే ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఆహ్వానం పంపడం, పైగా ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఈ సమావేశం ఏర్పాటు చేయడంపై దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.జూన్ 1న ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్ గడువు జూన్ 2న ముగియనుంది. కేవలం ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు 20రోజులకు పైగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ గడువు జూన్ 2తో ముగియడంతో తిరిగి తీహార్‌ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్‌ జరగనుంది. సీఎం కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జూన్ 1న ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే కేజ్రీవాల్ మే 27న తన మధ్యంతర బెయిల్ పిటిషన్‎పై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనారోగ్య కారణాల వల్ల మనీలాండరింగ్‌ కేసులో.. మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. గతంలో ఇచ్చిన బెయిల్‎ను మరో 7 రోజులపాటు పొడిగించాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ పిటిషన్ ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఈరోజు విచారించనుంది. ఒక వేళ గడువు పొడిగిస్తే ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో సీఎం కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టీడీలో కాకుండా బయట ఉండే అవకాశం ఉంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్‌ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఒకవేళ తమకు ఫలితాలు అనుకూలంగా వస్తే ఎలా ముందుకు సాగాలన్న దానిపై కూడా ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈ సమావేశం జరిగేందుకు సిద్దమైన తరుణంలోనే కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి క్లీన్ స్వీప్‌ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన భావనను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో సైతం కాంగ్రెస్ కూటమికి పది పార్లమెంటు స్థానాలు అలవోకగా వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కూటమికి సైతం గతంలో కంటే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం మసకబారితే ఆ పార్టీ అధికారానికి రావడం కష్టతరమని చెప్పవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీకి 30 పార్లమెంట్ స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నది ఆ పార్టీ అగ్ర నాయకులకు తెలియంది కాదు. ఉత్తరాదిలో జరగబోయే నష్టాన్ని దక్షిణాదిలో పుచ్చుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం గత మూడేళ్లుగా వ్యూహాత్మకంగా టార్గెట్ దక్షిణాది అంటూ చెమటోడ్చి పనిచేస్తున్నప్పటికీ, వారి ఆశలకు ప్రజా తీర్పుకు పొంతన ఉండే అవకాశాలు లేవు. పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ఇచ్చిన హామీలకు ప్రజల ఆశలకు పొంతన లేదని చెప్పవచ్చు. ఉపాధి కల్పన, దారిద్ర నిర్మూలన, అభివృద్ధి, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామిక నిర్ణయాలు, అవినీతి నిర్మూలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు.పదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోడీ విఫలమైనట్లు ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు భావిస్తున్నారు. నల్లధనం ఏరివేత పేరుతో చేసిన పెద్దనోట్ల రద్దు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందంగా తయారైంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అటు ఉంచితే ఈ పదేళ్ల సుదీర్ఘ కాలంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేని స్థితిలో మోడీ ప్రభుత్వం పనిచేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. నరేంద్ర మోడీ కంటే ముందు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పులకు మూడింతల అప్పు నరేంద్ర మోడీ హయాంలో పెరిగిందంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేయడం, మత ఘర్షణలను రెచ్చగొట్టడం, పేదరికాన్ని మరింత పెంచడం, సంపన్నుల ఆదాయం అమాంతం పెరిగిపోతుండటం, పేదలు పేదలుగానే మిగిలిపోతుండడం పట్ల ఓటర్లలో ఆ పార్టీ పట్ల అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, 80 కోట్ల భారతీయులకు 5 కిలోల చొప్పున సబ్సిడీ బియ్యాన్ని అందిస్తామని ప్రఆరు విడుతల పోలింగ్‌ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్‌మెంట్‌ ప్రణాళికలు రచించుకుంటున్నారు అంటూ స్పందించారు. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా పతనం అయిందన్నారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా.. ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో కూడా బీజేపీ బలం సంగానికి పడిపోయిందని వ్యాఖ్యానించారు జైరాం రమేష్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *