సిరా న్యూస్,ఎన్టీఆర్ కృష్ణా;
కృష్ణానది వరద తీవ్రత దివి సీమను తాకింది. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద 21 అడుగులకు వరద నీటిమట్టం చేరింది. పులిగడ్డ వద్ద ఆక్విడెక్ట్ పూర్తిగా నీటమునిగింది. మోపిదేవి మండలం కే. కొత్త పాలెం ఎస్సీ వాడలోకి వరద నీరు చేరుకుంది. అధి్కారులు కాలనీలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెం, మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది