ఫైన్లు వేయడం జరిమానా విధించడం మా అభిమతంకాదు
పోలీస్ కమిషనర్ డాక్టర్. బి. అనురాధ
సిరా న్యూస్,సిద్దిపేట;
మైనర్ డ్రైవింగ్ చేసిన వ్యక్తులపై 509 కేసులు, నమోదు చేయడం జరిగింది.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్ లు అమర్చితే చర్యలు తప్పవు.
జిల్లాలో త్రిబుల్ రైడింగ్ , మైనర్ డ్రైవింగ్, డబుల్ సైలెన్సర్ల పై స్పెషల్ డ్రైవ్, పట్టుబడితే చర్యలు తప్పవు.
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్ లు,అధిక శబ్దాలు వచ్చేలా వాహనాలకు సైలెన్సర్లు బిగించే వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
గత కొన్ని రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగించిన 30 వాహనలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, త్రిబుల్ రైడింగ్ చేసే వారిపై 305, మందికి జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై 509 కేసులు నమోదు, నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలను రక్షించుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి.