జిల్లాల నేతలతో సమావేశం కొనసాగుతోంది

ఓటర్ల జాబితాలో అక్రమాలు.. అన్నీ ఇన్నీ కావు
నిమ్మగడ్డ రమేశ్కుమార్
సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..

ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని.. పార్టీ, ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటుచేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ”ఏపీలో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉంది. ఈ విషయంలో పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నాం. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాలగా కాదు.. వర్సిటీగా మారింది. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారాలి. మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు ఒక సాధనం. నేటి యువత ఏది మంచి.. ఏది చెడో తెలుసుకోవాలి. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలి” అని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *